ఈసారి రాష్ట్రంలో భారీ దిగుబడి నమోదైంది. అయినప్పటికీ, కేంద్రం నుంచి పరిమిత లక్ష్యాలకే అనుమతి వచ్చిందనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించు కోవాలని చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నా యి. మొదట ప్రతి గింజ కొనుగోలు చేస్తాం అంటూ రైతులను నమ్మబలికి, తర్వాత లక్ష్యాన్ని తగ్గించడం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీంతో మిగిలిన ధాన్యం దళారు లు, మిల్లర్ల చేతికి చిక్కి తక్కువ ధరలకు అమ్ముడవుతోంది. రైతు కష్టానికి సరైన ధర దక్కకపోవడంతో అప్పుల భారం మరింత పెరుగుతోంది. ఇది కేవలం పరిపాలనా లోపం మాత్రమే కాదు.. రైతాంగ విశ్వాసాన్ని దెబ్బతీసిన నిర్ణయంగా మారింది.  

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతుల కు ఎన్నో హామీలు ఇచ్చింది. రైతు రాజ్యం తీసుకొస్తాం, ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, రైతు కష్టానికి పూర్తి విలువ ఇస్తాం అంటూ భారీ ప్రకటనలు చేసింది. కానీ అధికారం లోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. నేడు ఖమ్మం, మహ బూబాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి మొలకెత్తుతోం ది. దళారులు, మిల్లర్లు రైతు బలహీనతను ఆసరాగా చేసుకుని అతి తక్కువ ధరలకు పంటను దోచుకుంటున్నారు.

తెలంగాణ రైతాంగం నేడు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయింది. నెలల తరబడి పొలంలో చెమటోడ్చి, అప్పులు చేసి, కుటుంబ భవిష్యత్తును పణంగా పెట్టి పండించిన వరి, మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు కన్నీళ్లను గాలికొదిలేసి, సమీక్షల నాటకాలతో కాలం నెట్టేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద వర్షానికి తడిసి కుళ్లిపోతున్న ధాన్యం ఒక వైపు.. కళ్లలో నీళ్లు, గుండెల్లో భయం, చేతుల్లో నిస్సహాయతతో నిలబడిన రైతులు మరోవైపు కనిపిస్తున్న దృశ్యాలు తెలంగాణ గ్రామీణ జీవనాన్ని కలచివేస్తున్నాయి. ఒక రైతు జీవితంలో పంట అంటే కేవలం ధాన్యం కాదు.. అది అతని బతుకు ఆధారం, పిల్లల చదువు, కుటుంబ గౌరవం, అప్పుల నుంచి బయటపడే ఆశ. అలాంటి పంట నేడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్లపైనే కుళ్లిపోతోంది. రైతు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్దే నిద్రపోతున్నాడు. వర్షం వస్తే ధాన్యాన్ని కాపాడుకోవడానికి టార్పాలిన్ల కోసం పరుగులు పెడుతున్నాడు. కానీ అధికార యంత్రాంగం మాత్రం స్పందనలేని రాతిబండలా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతాంగం ఎదుర్కొంటున్న ఈ విషాదాన్ని చూసీచూడనట్టుగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

ఇక్కడ మరో అత్యంత కీలకమైన అంశం వెలుగులోకి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మొదట 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ఘనంగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని నిశ్శబ్దంగా 75 లక్షల మెట్రిక్ టన్నులకు కుదించింది. ఇప్పుడు రైతులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. ఈ తగ్గింపు వెనుక అసలు కారణం ఏమిటి? ఈసారి రాష్ట్రంలో భారీ దిగుబడి నమోదైంది. అయినప్పటికీ, కేంద్రం నుంచి పరిమిత లక్ష్యాలకే అనుమతి వచ్చిందనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట ప్రతి గింజ కొనుగోలు చేస్తాం అంటూ రైతులను నమ్మబలికి, తర్వాత లక్ష్యాన్ని తగ్గించడం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీంతో మిగిలిన ధాన్యం దళారులు, మిల్లర్ల చేతికి చిక్కి తక్కువ ధరలకు అమ్ముడవుతోంది. రైతు కష్టానికి సరైన ధర దక్కకపోవడంతో అప్పుల భారం మరింత పెరుగుతోంది.

ఇది కేవలం పరిపాలనా లోపం మాత్రమే కాదు.. రైతాంగ విశ్వాసాన్ని దెబ్బతీసిన నిర్ణయంగా మారింది. ఇప్పటికే గన్నీసంచుల కొరత, గోదాముల లేమి, లారీల సమస్య, హమాలీల కొరత రైతులను నరకయాతనకు గురిచేస్తున్నాయి. పంట చేతికొచ్చి వారాలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం సమీక్షలు నిర్వహిస్తున్నాం అనే మాటలకే పరిమితమవడం పాలనా వైఫల్యానికి పరాకాష్టగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో హామీలు ఇచ్చింది. రైతు రాజ్యం తీసుకొస్తాం, ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, రైతు కష్టానికి పూర్తి విలువ ఇస్తాం అంటూ భారీ ప్రకటనలు చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. నేడు ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి మొలకెత్తుతోంది. దళారులు, మిల్లర్లు రైతు బలహీనతను ఆసరాగా చేసుకుని అతి తక్కువ ధరలకు పంటను దోచుకుంటున్నారు.

ప్రభుత్వం చెబుతున్న అంకెలు ఒక వైపు ఉంటే, రైతు కళ్లలో కనిపిస్తున్న బాధ మరోవైపు ఉంది. రైతు గుండెల్లో మండుతున్న ఆవేదనను కాగితాలపై ఉన్న సమీక్షలు చల్లార్చలేవు. నేడు తెలంగాణ రైతాంగం అడుగుతున్న ప్రశ్నలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. గన్నీ సంచులు ముందుగానే ఎందుకు సిద్ధం చేయలేదు? కొనుగోలు కేంద్రాల్లో అవ్యవస్థ ఎందుకు కొనసాగుతోంది? రైతులకు వెంటనే చెల్లింపులు ఎందుకు చేయడం లేదు? అకాల వర్షాలకు ముందే రక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? 90 లక్షల లక్ష్యాన్ని ఎందుకు తగ్గించారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతి సమస్యకు కేంద్రాన్ని నిందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను దాచుకోలేదు. రైతు జీవితాలు రాజకీయ ఆరోపణలతో నడవవు. రైతు కన్నీళ్లు ఎండిపోతేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.

తెలంగాణ గ్రామాల్లో నేడు కనిపిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం దగ్గర రైతులు తలలు పట్టుకుని కూర్చుంటున్నారు. ఈ పంట అమ్ముడుపోకపోతే అప్పులు ఎలా తీర్చాలి? పిల్లల చదువులు ఎలా కొనసాగించాలి? మళ్లీ సాగు ఎలా చేయాలి? అనే ఆవేదన ప్రతి రైతు కుటుంబంలో వినిపిస్తోంది. రైతు భార్యల కళ్లల్లో భయం కనిపిస్తోంది. రైతు పిల్లల్లో అనిశ్చితి పెరుగుతోంది. అయినా పాలకుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. మొదట ప్రకటించిన 90 లక్షల లక్ష్యం ప్రకారం పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేపట్టాలి. రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలి. గన్నీసంచులు, గోదాములు, రవాణా సౌకర్యాలను అత్యవసరంగా అందుబాటులోకి తేవాలి. అకాల వర్షాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన రైతులకు సరైన నష్టపరిహారం ప్రకటించాలి. దళారుల దోపిడీని అరికట్టాలి.

రైతు కేవలం ఓటరు కాదు.. ఈ రాష్ట్రానికి అన్నం పెట్టే అన్నదాత. అలాంటి రైతును నిర్లక్ష్యం చేయడం అంటే తెలంగాణ ఆత్మను అవమానించినట్టే. పాలకులారా.. ఇప్పటికైనా రైతు కన్నీళ్ల విలువ తెలుసుకోండి. లేదంటే నేడు కొనుగోలు కేంద్రాల వద్ద కారుతున్న ఆ కన్నీళ్లు రేపు మీ రాజకీయ భవిష్యత్తును ముంచెత్తే ప్రవాహంగా మారడం ఖాయం.

- కాలగిరి శ్రీనివాస్‌రెడ్డి

90101 28884