9630 articles



నవతెలంగాణ-చిన్నగూడూరు: ఇటీవల సోషల్ మీడియాలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సై కుశకుమార్ కు ఫిర్యాదు చేశారు. గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడారు. కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ జర్నలిస్ట్ అని, బ్లాక్మెయిల్ కు పాల్పడుతూ, డోర్నకల్ ఎమ్మెల్యే ఫోటోలను ప్రచురితం చేస్తున్న వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని […] The post సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.


నవతెలంగాణ-హైదరాబాద్: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంచలన ప్రకటన చేశారు. గాజా స్ట్రిప్‌లోని 70 శాతం భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకోవాలని ఇజ్రాయిల్ సైన్యాన్ని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. గాజాలోని అధిక భూభాగం సైనిక నియంత్రణలోకి తీసుకునే ప్లాన్‌ను నెతన్యాహూ ప్రకటించారు. గురువారం వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ దళాలు తమ పట్టును క్రమంగా పెంచుకుంటున్నాయని, హమాస్‌కు వ్యతిరేకంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉంటాయని అన్నారు. […] The post గాజాలో సైన్య విస్తరణకు ఇజ్రాయిల్ ప్లాన్ appeared first on Navatelangana.



నవతెలంగాణ-హైదరాబాద్: బ్లూ ఆరిజిన్ ‘న్యూ గ్లెన్’ రాకెట్ టెస్టింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. రాకెట్ ఇంజన్లను మండించి చూసే ఈ పరీక్ష సమయంలో ఒక్కసారిగా లాంచ్ ప్యాడ్‌పైనే భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుడు ధాటికి రాకెట్ ప్రయోగ వేదిక (Launch Pad) తో పాటు రాకెట్ పరికరాలు భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే, ఈ పరీక్షను రిమోట్ కంట్రోల్ ద్వారా సురక్షిత ప్రాంతం నుండి పర్యవేక్షించడం వల్ల, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద […] The post బ్లూ ఆరిజిన్ టెస్టింగ్‌లో ప్రమాదం appeared first on Navatelangana.


వ్యవసాయ రంగంలో అధిక దిగుబడుల కోసం రైతులు సంవత్సరాలుగా రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు. మొదట్లో మంచి ఫలితాలు ఇచ్చిన ఈ ఎరువులు ప్రస్తుతం భూమి సారవంతాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరియా, డిఎపి, పొటాష్ వంటి రసాయన ఎరువులను అధికంగా వాడటం వల్ల నేలలోని సహజ సూక్ష్మజీవులు నశించి, భూమి పోషక విలువలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పంట దిగుబడులు తగ్గిపోవడం, నేల గట్టిపడటం, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయం చేయడం కూడా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు రైతులకు మేలు చేస్తున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పశువుల ఎరువు, జైవామృతం, ఘన జీవామృతం, వెర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ పద్ధతులు భూమి సహజ సారాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల నేలలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉండటంతోపాటు పంటలకు అవసరమైన పోషకాలు సహజంగా అందుతాయి. రసాయన ఎరువుల ఖర్చు తగ్గడంతో రైతుల ఆర్థిక భారం కూడా త



ప్రస్తుత ప్రపంచంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఎఐ) మౌలిక సదుపాయాలు కూడా రహదార్లు, ఓడరేవుల వంటి వ్యూహాత్మక జాతీయ ఆస్తులుగా మారుతున్నాయి. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం, రాబోయే ఐదేళ్లలో భారతదేశంలోని డేటా సెంటర్లలో దాదాపు 7 లక్షల గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను (జిపియులు) మోహరించే అవకాశం ఉంది. ఇది దాదాపు 23 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాన్ని సృష్టిస్తుంది. దేశంలో ఎఐ స్వీకరణ, డేటా సెంటర్ల విస్తరణ అనేది ఒక భారీ ఆర్థిక అవకాశాన్ని తెరిచింది. 2025 లో 1.6 గిగావాట్ల (జిడబ్ల్యు)గా ఉన్న భారత్ నిర్మిత డేటా సెంటర్ సామర్థ్యం, 2030 నాటికి దాదాపు 5 జిడబ్ల్యుకు చేరుకుంటుందని అంచనా. దీని వలన దాదాపు 25 బిలియన్ డాలర్ల మూలధన పెట్టుబడి అవసరమవుతుంది. 2024లో 10 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశపు ఎఐ మార్కెట్, 39 శాతం సమ్మేళన వార్షిక వృద్ధిరేటు (సిఎజిఆర్)తో 2032 నాటికి 131 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఇతర అంచనాల ప్రకారం, కృత్రిమ మేధ భారత ఆర్థిక వ్యవస్థకు 2035 నాటికి 1.7 ట్రిలియన్ డాలర్లను జోడించగలదని ప్రభుత్వ అంచనా. ఉపాధి & నైపుణ్యాభివృద్ధి: ప్రస్తుతం భారతదేశపు టెక్నాలజీ రంగంల




ఢిల్లీ: అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష పడి పదమూడు ఏళ్లు జైలు జీవితం గడిపిన వ్యక్తి నిర్దోషి అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సదరు నిందితుడికి లైంగిక సామర్థ్యంలేదని, కింద కోర్టులు ఎలా శిక్ష వేస్తాయని చురకలంటించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ప్రాసిక్యూషన్ కథనంలో లోపాలు ఉండడంతో నిందితుడితో పాటు స్నేహితుడికి సుప్రీంకోర్టు విముక్తి కల్పించింది. నిందితులకు ఉరిశిక్ష వేసిన కిందికోర్టు, హైకోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆమె ప్రతి ఘటించడంతో నిందితుల చంపేశారని ప్రాషిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఈ వాదనను సుప్రీంకోర్టు నిరాకరించింది, నిందితుడు మెహతాబ్ ను డాక్టర్ బిఎస్ అస్వాల్ పరీక్షించారు. శారీరక లోపం ఉండడంతో అతడు లైంగిక చర్యలో పాల్గొనడం లేడని తెలిపింది.





