కొప్పల్–విజయనగర సరిహద్దులోని జాతీయ రహదారి-50పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ట్రాక్టర్ అదుపుతప్పి వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడాది చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు.
మరో పది మందికి పైగా గాయపడగా, వారిని కొప్పల్ జిల్లా మరియు హొసపేట ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మునిరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.












