నవతెలంగాణ-మల్హర్‌రావు: అంగన్ వాడి కేంద్రాలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో టీచర్లు, ఆయాలు చిన్నారులకు,బాలింతలకు,చిన్న పిల్లల తల్లులకు తదితర లబ్ధిదారులకు పోషకాహారాలను ఇంటింటా వెళ్లి సరుకులు పంపిణీ చేయాలని మండల ఎంపిడిఓ క్రాoతికుమార్ ఆదేశించారు. శుక్రవారం కొయ్యుర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మతో కలిసి బాలింతలకు,చిన్నారులకు,చిన్న పిల్లల తల్లులకు గుడ్లు,పప్పులు,పాల ప్యాకేట్స్, ముర్కులు,పల్లి పట్టీలు,బాలామృతం తదితర పోషకాహారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
The post బాలింతలకు సరుకుల పంపిణీ appeared first on Navatelangana.













