దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలలో ఒకటైన మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగంలో అనేక వాహనాలను విక్రయిస్తోంది. నివేదికల ప్రకారం..ఈ నెలలో ఈ సంస్థ అందిస్తున్న అనేక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను కొనుగోలు చేయడం ద్వారా లక్షల రూపాయల వరకు ఆదా చేయవచ్చు. ఈ నెలలో సంస్థ అందిస్తున్న ప్రతి వాహనంపై ఎంత ఆదా చేయవచ్చనే ఇప్పుడు తెలుసుకుందాం.

మహీంద్రా XUV 400

మహీంద్రా భారత మార్కెట్లో XUV 400ను అందిస్తోంది. ఈ నెలలో ఈ ఎస్‌యూవీ కొనుగోలు చేయడం ద్వారా అత్యధిక ఆదాను పొందవచ్చు. నివేదికల ప్రకారం..ఈ నెలలో తయారీదారు ఈ ఎస్‌యూవీ పై రూ. 2.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్లు నగదు తగ్గింపుల రూపంలో ఉన్నాయి.

మహీంద్రా BE6

మహీంద్రా ఈ నెలలో BE6 ఎస్‌యూవీ పై రూ.2 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. తయారీదారు ఈ అవకాశాన్ని నగదు తగ్గింపు రూపంలో అందిస్తున్నట్లు సమాచారం.

మహీంద్రా XEV 9e

మహీంద్రా భారత మార్కెట్లో XEV 9e ని కూడా అందిస్తోంది. ఈ నెలలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పై తయారీదారు రూ.1.40 లక్షల వరకు ఆదాను అందిస్తోంది.