
హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గోకుల్ ఫ్లాట్స్‌లో సిఎ చదువుతున్న కుమ్మరి జనార్ధన్ అనే యువకుడుఅనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన గదిలో ఉరికి వేలాడుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గదిలో రక్తపు మరకలు కూడా ఉండటంతో జనార్థన్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.













