
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 70 సార్లు ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డిపై మాట్లాడలేదని అన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు పాలమూరు-రంగారెడ్డిని సందర్శించిన దాఖలేవని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చారా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. మక్కజొన్న, వరి రైతులు అరిగోస పడుతున్నారని, తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ సాగునీరు ఇవ్వలేదని కొందరు మాట్లాడుతున్నారని, తెలంగాణ రాక ముందు యాసంగిలో 4-5 లక్షల ఎకరాల్లో వరిసాగు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 యాసంగిలో 65 లక్షల వరిసాగు, జలసంపద, పాడి పంటలు వృద్ధి చేసి తెలంగాణ దశదిశను మార్చామని నిరంజన్ రెడ్డి తెలియజేశారు. ట్రాన్స్ ఫోర్ట్ టెండర్లు అనర్హులకు ఇవ్వడం వల్లే సమస్య అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.












