
విజయవాడ-చెన్నై జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరిం చడంతో ప్రయాణికులందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో బస్సు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో బస్సు వెనుక టైరు నుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ సుభాష్ గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. పరిస్థితి ప్రమా దకరంగా ఉందని గ్రహించి, రెండో డ్రైవర్ సాయంతో నిద్రలో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన కిందకు దించేశారు. ప్రయాణికులు వారి లగేజీని సురక్షితంగా కిందకు చేర్చిన కొద్దిసేపటికే టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి.
ఫైర్ ఇంజ న్లు వచ్చేలోపే బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఈ ట్రావెల్స్ బస్సులో తొలుత మొత్తం 36 మంది ప్రయాణీకులు ఉండగా కొంత మంది మార్గమధ్యంలో తమ గమ్యస్థానాల్లో దిగిపోయారు. మిగిలిన 10 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడటంతో అంద రూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కందుకూరు ఆర్టీఓ అధికారిణి నాగలక్ష్మి హుటాహుటిన ఘటనా స్థలాని కి చేరుకుని పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలను డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్లు, డ్రైవర్ల లైసెన్సుల ను తనిఖీ చేశారు. ప్రాథమిక విచారణలో బస్సుకు అన్ని అనుమతులు ఉన్నాయని, నిబంధనల ప్రకారమే నడుస్తోందని ఆర్టీవో అధి కారిణి నాగ లక్ష్మి వెల్లడించారు. వెనుక వైపు పొగలు రావడం గమనించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సు ఆపి అందరినీ కిందకు దింపేశాం. మేమ ందరం దిగిన కొద్ది సేపటికే మంటలు ఎగిసిపడి బస్సు కాలిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది అని డ్రైవర్ సుభాష్ వెల్లడించారు.











