
ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయంతో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసింది. ఈ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. తన 75 పరుగుల అజేయమైన ఇన్నింగ్స్‌తో ముంబైని గెలిపించాడు. ఈ సందర్భంగా అతడు చేసుకున్న సెలబ్రేషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే, ఇవన్నీ రోహిత్ శర్మ కోసమే అని ఆ తర్వాత తిలక్ వర్మ తెలిపాడు. ‘45’ అంకెలను చూపిస్తూ.. ఇది నీ కోసమని చెప్పడం విశేషం. దీంతో డగౌట్‌లో ఉన్న రోహిత్ నవ్వుతూ కనిపించాడు.
అనంతరం డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లాక.. సైడ్‌ఆర్మ స్పెషలిస్ట్ ముర్తుజా హుస్సేన్‌తో రోహిత్, తిలక్ వీడియో కాల్‌లో మాట్లాడారు. ‘‘మనతో ఆర్ఎస్ 45 ఉన్నారు. నేనెప్పుడు రోహిత్ భాయ్ మాటే వింటా’’ అని తిలక్ హార్ట్ సింబల్ చూపించాడు. అనంతరం తిలక్ ఇన్నింగ్స్‌ను రోహిత్ ప్రశంసించాడు. తన ఇన్నింగ్స్‌ను చూడొద్దని తిలక్ ఆటను చూడాలని చెప్పడం గమనార్హం.











