రణ్‌వీర్ సింగ్ హీరోగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధురంధర్-2’. ఈ మార్చి 19న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాక.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే థియేటర్‌లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లకి ఇది గుడ్‌న్యూస్ త్వరలోనే ఈ సినిమా ఒటిటిలో సందడి చేయనుంది. భారత్‌లో ఈ సినిమా ‘జియో హాట్‌స్టార్‌’లో రిలీజ్ కానుందనే విషయం తెలిసిందే. తాజాగా స్ట్రీమింగ్ డేట్‌ని సంస్థ అధికారికంగా ప్రకటించింది.

జూన్ 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. జూన్ 4న రాత్రి 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శించనున్నట్లు తెలిపింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మిగిలిన దేశాల్లో ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. ఒటిటిలో కొన్ని సన్నివేశాలను జోడించారు. థియేట్రికల్ రన్‌ 3 గంటలా 49 నిమిషాలు కాగా, ఒటిటి వెర్షన్ 3 గంటల 52 నిమిషాలుగా ఉండనుంది.