పోక్సో కేసులో కానిస్టేబుల్ కి 30 ఏళ్ల జైలు శిక్ష పడింది. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో  ఫోక్సో స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. పోలీస్ కానిస్టేబుల్‌ వరదరాజ్ సుదేశ్ పై నమోదైన అత్యాచారం, పోక్సో కేసులో నేరం రుజువు కావడం తో పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. నిందితుడికి రూ.12000  జరిమానాతో పాటు 30 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే బాధిత బాలికకు రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది.