హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఫోక్సో కేసులో భవిష్యత్తులో తన పేరు వాడొద్దని పిటిషన్ వేశారు. తన పేరుతో ఇప్పటివరకు వాడిన వీడియోలు తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

మరోవైపు బండి భగీరథ్ కేసులో బాలిక వివరాలు సోషల్‌మీడియాలో ప్రసారం కావడంపై కేసు నమోదైంది. బాలిక ఫోటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాలు ప్రసారంపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్‌ ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. సోషల్‌మీడియా నిర్వాహకులపై కేసులు పెట్టినట్లు తెలిపారు.