
హోసపెటే: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో వంతెనపై నుంచి పడి ఏడాది చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పల తాలూకా మునీరాబాద్ వద్ద వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగే సమయానికి ట్రాక్టర్‌లో 16 మంది ఉన్నారు. మునీరాబాద్ సమీపంలోని హులిగమ్మ దర్శనానికి ట్రాక్టర్‌లో భక్తులు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. మృతులను సండూరు, కూడ్లిగి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలాన్ని కొప్పల, విజయనగర ఎస్పీలు పరిశీలించారు.













