టాలీవుడ్‌లో ఆసక్తికర క్లాష్‌కు రంగం సిద్ధమవుతోంది. విలక్షణ నటుడు సత్యదేవ్ నటిస్తున్న సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ జూన్ 5న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ కాన్సెప్ట్‌తో ఇప్పటికే టీజర్ ద్వారా మంచి హైప్ సంపాదించింది. మహేష్ బాబు హోమ్ బ్యానర్ GMB Entertainment సమర్పిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ కూడా జూన్ 4న రిలీజ్ అవుతుండటంతో పరిస్థితులు హాట్‌గా మారాయి. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పెద్ద సినిమాతో క్లాష్ అంటే చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిస్క్ అనే భావన మధ్య... ‘రావు బహదూర్’ టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తిగా మారింది. వాయిదా వేస్తారా? లేక ధైర్యంగా బరిలో దిగుతారా? అన్నది సస్పెన్స్‌గా ఉంది.









