అమెరికాలోని తెలుగు భక్తులకు ఓ శుభవార్త..! భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే “భద్రాచల శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం” ఈసారి అమెరికా నేలపై ఘనంగా జరగనుంది. తెలుగు సంస్కృతిని విదేశాల్లోనూ సజీవంగా నిలబెడుతున్న మన అమెరికా తెలుగు అసోసియేషన్ — మాటా (MATA), హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మే 30, 2026 శనివారం ఉదయం 10 గంటలకు ఫ్లోరిడాలోని టాంపా నగరంలో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా వేదికగా ఈ దివ్య కళ్యాణ వేడుక ప్రారంభం కానుంది. శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ భక్తి పరవశంలో మునిగిపోవాలని అమెరికాలోని తెలుగు కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాటా కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు సేవార్థిగా 101 డాలర్లు, మహా సేవార్థిగా 501 డాలర్లు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు MATA అధికారిక వెబ్‌సైట్ www.mata-us.org ను సందర్శించవచ్చు.
















