అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) కార్యక్రమాలకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తన మద్దతు, అభినందనలు తెలియజేశారు. అమెరికాలోని తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడంలో మాటా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ప్రశంసించారు.
సామాజిక సేవా కార్యక్రమాలు, కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలుగు వారసత్వాన్ని భావితరాలకు చేరవేయడంలో మాటా చేస్తున్న కృషి అభినందనీయమని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిలడెల్ఫియాలో ఘనంగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక మాటా 2వ కన్వెన్షన్ 2026 విజయవంతం కావాలని ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మహాసభలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక ప్రదర్శనలు, కమ్యూనిటీ ఈవెంట్లు తెలుగు ప్రజలను మరింత దగ్గర చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల మధ్య ఐక్యత, అనుబంధాలను మరింత బలోపేతం చేసే వేదికగా ఈ కన్వెన్షన్ నిలవాలని ఆకాంక్షించారు.
మహాసభ నిర్వాహకులు, వాలంటీర్లు, పాల్గొనే ప్రతిఒక్కరికీ విజయాన్ని కోరుతూ, తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం మాటా భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో సేవలు కొనసాగించాలని భాను ప్రకాష్ రెడ్డి ఆకాంక్షించారు.













