టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగరంలో మేయర్ అభ్యర్థి మార్క్ హిల్‌తో నిర్వహించిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. స్థానిక కమ్యూనిటీ సభ్యులు, వివిధ వర్గాల నాయకులు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై మార్క్ హిల్‌తో ప్రత్యక్షంగా ముచ్చటించారు.

సంతోష్ ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి, ప్రజా సేవలు, భవిష్యత్ కార్యాచరణపై మార్క్ హిల్ తన విజన్‌ను వివరించారు. హాజరైన వారు తమ అభిప్రాయాలు, సమస్యలను ఆయనతో పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి తెలుగు కమ్యూనిటీ నుంచి కూడా విశేష స్పందన లభించింది. ఫ్రిస్కో నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగగా, కమ్యూనిటీ సభ్యులు మార్క్ హిల్‌కు తమ మద్దతు తెలిపారు.

స్నేహపూర్వక వాతావరణంలో సాగిన ఈ సమావేశం విజయవంతంగా ముగియడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. మార్క్ హిల్ ప్రచార కార్యక్రమాల్లో ఇది మరో కీలక ఘట్టంగా నిలిచిందని వారు పేర్కొన్నారు.

WhatsApp Image 2026-06-05 at 9.53.00 PM (1).jpeg