అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో శ్రీ వైకుంఠ రామ–సీతా కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 30, 2026 శనివారం ఉదయం 10 గంటలకు ఈ దివ్య వేడుక జరగనుంది.

భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తే ఈ మహోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా భద్రాచలం నుండి నేరుగా తీసుకువచ్చిన ఉత్సవ విగ్రహాలతో సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ అరుదైన సందర్భాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు.

భక్తి, సంప్రదాయం, సంస్కృతి కలయికగా నిలిచే ఈ కల్యాణ మహోత్సవంలో పాల్గొని దివ్యానుభూతిని పొందాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. కుటుంబ సమేతంగా హాజరై శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. సీతారాముల కల్యాణం… చూడటానికి కమణీయం… అనుభవించడానికి కడు రమణీయం… భక్తి తరంగాల్లో మునిగిపోయే ఈ దివ్య వేడుక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

సేవా అవకాశాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. మహా సేవార్తి కోసం 501 డాలర్లు, సేవార్తి కోసం 101 డాలర్లు నిర్ణయించారు.

For Seva Opportunities - https://htfl-festival-seva.square.site/

sitarama kalyanam flayer.jpeg