🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
🕉️ సంస్కృతి›🧒 పిల్లల కార్నర్›📖 తీరని కోరిక
📖
మరిన్ని నీతి కథలు

తీరని కోరిక

teerani koorika

⏱️ 9 నిమిషాల పఠనం


telugu lokam1

సోమాపురం అనే గ్రామంలో రామన్న అనే చాకలి ఒకడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. ప్రతిరోజు రామన్న దాని వీపు మీద బట్టల మూటలు చెరువుకు తోలుకొని వెళ్ళేవాడు. బట్టలు ఉతికి, ఆరబెట్టి తిరిగి వచ్చేటపుడు ఇంటింటికి తిరిగి ఎవరి బట్టలు వారికి ముట్టజెప్పేవాడు. ఆ గాడిద ఉన్న దాంతో తృప్తి పడే రకం కాదు. ఆ గాడిద పని చేసి చేసి విసిగిపోయింది. బట్టలు మూటలు మోయడం దానికి ఏ మాత్రం ఇష్టం లేదు.

ఒకరోజు గాడిద దేవుడిని ప్రార్ధించి,”ఓ దేవుడా! దయచేసి నన్ను ఈ పనిలోంచి బయటపడేలా చేయి. ఇలాంటి పని చేయాలంటే నాకు అసహ్యం వేస్తోంది. ఈ రామన్న నాచేత విపరీతమైన బరువులు మోయిస్తున్నాడు. నన్ను కాపాడు” అంటూ ప్రార్దించింది. గాడిద ప్రార్ధనకు దేవుడు ప్రత్యక్షమై “నాకు నువ్వు చేసే చాకిరి గురించి తెలుసు. బరువైన మూటలు మోసే నీ పట్ల నాకు ఎంతో జాలి కలుగుతుంది. ఇక నుంచి నువ్వు చాకలి దగ్గర కాకుండా కుమ్మరి దగ్గర ఉండేలా అనుగ్రహిస్తున్నాను” అని వరం ఇచ్చాడు దేవుడు. దానితో గాడిద ఆనందంగా కుమ్మరి గోపయ్య దగ్గరకు వెళ్లి ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత గాడిదకు ఆ పని కూడా విసుగుపుట్టింది. కుండలు మోసుకొని ఊరూరా సంతకు తిరిగి అమ్మడం కష్టంగా అనిపించింది. గాడిద తిరిగి దేవుడిని ప్రార్దించింది. “దేవుడా! కుమ్మరి దగ్గర పని బాగుంటుందనుకున్నాను గానీ చాకలి దగ్గర పనికీ, కుమ్మరి దగ్గర పనికీ తేడా కనిపించటం లేదు. దయ చేసి నాకు ఇంకేదైనా పని ఇవ్వు” అన్నది.

రెండోసారి కూడా దేవుడు దాని మొరను ఆలకించి, ఒక చెప్పులు కుట్టే వాని దగ్గర పని దొరికేలా చేశాడు. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. “ఇక్కడ కూడా నాకు బాగోలేదు’ నా చేత బరువులు మోయించి మోయించి నన్ను చంపేస్తాడు. నేను చచ్చాక ఆనందంగా నా చర్మంతో కూడా చెప్పులు కుడతాడు” అని ఆలోచించింది గాడిద.

గాడిద మళ్ళీ దేవుణ్ణి ప్రార్ధించింది. కానీ ఈ సారి గాడిద వల్ల దేవుడు కూడా విసిగిపోయాడు. “నిన్ను ఎందరి దగ్గరకు పంపినా శుద్ధ దండగ. నీకసలు ఏపనిలోనూ సంతృప్తి లేదు. ముందుగా నీవు చేసే పనిని ఇష్టపడటం నేర్చుకో, అప్పుడు నీకు ఏపని చేసినా విసుగు పుట్టదు” అని గాడిదను గట్టిగా మందలించాడు.

📖 మరిన్ని మరిన్ని నీతి కథలు

📖⏱️ 7 min
తగిన శాస్తి
tagina shaasti
📖⏱️ 8 min
ప్రతిఫలం
pratiphalm
📖⏱️ 5 min
రైతు త్యాగబుద్ది
raitu tyaagabuddi
📖⏱️ 13 min
మంచి స్నేహితుడెవరు?
mmchi sneehitudevaru?
📖⏱️ 6 min
కట్టెలు కొట్టువాడు – బంగారు గొడ్డలి
kattelu kottuvaadu – bmgaaru goddali
📖⏱️ 14 min
కనువిప్పు
kanuvippu
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Advertisement
Sponsored by TTA – Telangana American Telugu Association
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి