టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగరానికి కొత్త మేయర్‌గా మాజీ ఫ్రిస్కో ఐఎస్డీ ట్రస్టీ Mark Hill ఎన్నికయ్యారు. జరిగిన రన్‌ఆఫ్ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి Rod Vilhauerపై విజయం సాధించారు. జూలై 7న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ ఎన్నికల్లో 33 వేలకుపైగా ఓటర్లు పాల్గొని ఫ్రిస్కో మున్సిపల్ ఎన్నికల చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు. గత 15 నెలల్లో ఈ మేయర్ పోరుకు మిలియన్ డాలర్లకు పైగా ఖర్చవడం విశేషం.

విజయం అనంతరం మాట్లాడిన మార్క్ హిల్, “ఫ్రిస్కోలో గెలవాలంటే ప్రతి వర్గాన్ని కలవాలి” అని అన్నారు. హిందూ, ముస్లిం, హిస్పానిక్, ఆసియన్ సమాజాల మద్దతుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో ఐక్యత, సమగ్రత కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు.

పదవీకాల పరిమితి కారణంగా వైదొలుగుతున్న మాజీ మేయర్ Jeff Cheney స్థానంలో మార్క్ హిల్ బాధ్యతలు చేపట్టనున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్రిస్కో నగర భవిష్యత్తుపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.