మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకుని ఇద్దరికి పునర్జన్మను ప్రసాదించారు. తీవ్ర అనారోగ్యంతో పాటు ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు సినీ కార్మికుల కుటుంబాలకు తన వంతు ఆర్థిక సాయం చేసి... రీల్ లైఫ్ లోనే కాదు నిజ జీవితంలోనూ తానూ హీరోనే అని మరోసారి నిరూపించుకున్నారు చిరు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ హార్ట్ సర్జరీకి 10.5 లక్షల రూపాయాలు మాజీ మేనేజర్ కేవీ నరసయ్య భార్య బైపాస్ సర్జరీకి 9.5 లక్షల రూపాయాలు అందించారు. అలాగే ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీంతో ఆయన దాతృత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా మొదట సాయం చేసేది చిరునేనని అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
BREAKING
ఇద్దరికి పునర్జన్మ... అందుకే మెగాస్టార్

Looking for a Telugu Match?
Verified profiles, NRI-focused matchmaking.
Related News
Comments
Login to leave a comment











