అమెరికాలోని ప్రతిష్టాత్మక తెలుగు సంస్థ అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ATA 19వ మహాసభల సన్నాహకాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో భాగంగా డల్లాస్‌లో భారీ ఎత్తున ‘కాన్ఫరెన్స్ కిక్ఆఫ్’ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 24, శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఫ్రిస్కోలోని ‘శుభం ఈవెంట్ సెంటర్’లో ఈ వేడుక గ్రాండ్ గా జరగనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, కాక్ టెయిల్స్ , డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న 19వ ఏటా మహాసభలు, యూత్ కన్వెన్షన్‌కు సంబంధించిన విశేషాలను ఈ సమావేశంలో ప్రకటించనున్నారు.
ఈ కార్యక్రమ విజయవంతంగా జరగడం కోసం ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ రెడ్డి, సెక్రటరీ సాయినాథ్ బోయపల్లి , డల్లాస్ ప్రాంత రీజినల్ కోఆర్డినేటర్లు స్వప్న తుమ్మపాల, శ్యామ్ మలసాల తదితరులు పర్యవేక్షిస్తున్నారు. డల్లాస్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు వారందరూ ఈ కిక్ఆఫ్ వేడుకలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

