జీతం కోసం నెలంతా ఎదురుచూస్తున్నారా...! నెలాఖరు దగ్గర పడితే ఖర్చుల టెన్షన్ పెరుగుతుందా? ఇక ఆ స్ట్రెస్‌కు గుడ్‌బై చెప్పే టైమ్ వచ్చేసింది… నేపాల్ తీసుకున్న కొత్త నిర్ణయం అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రభుత్వ ఉద్యోగుల ఫైనాన్షియల్ లైఫ్‌స్టైల్‌ను పూర్తిగా మార్చేలా నేపాల్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు నెలాఖరు వరకు జీతం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి శాలరీ అందేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. ఈ కీలక నిర్ణయానికి నేపాల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మార్పు వెనుక ముఖ్య కారణం మిడిల్ క్లాస్ ఉద్యోగుల ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం. నెలాఖరులో డబ్బులు అయిపోవడం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గి, పిల్లల ఫీజులు, బిల్లులు, రోజువారీ ఖర్చులు సులభంగా నిర్వహించవచ్చు.
ఇంకా ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, మార్కెట్లో డబ్బు నిరంతరం చలామణి అవుతుంది. దీని వల్ల చిన్న వ్యాపారాలు, రిటైల్ షాపులకు కూడా మంచి లాభం ఉంటుంది. అప్పులు తీసుకునే అవసరం కూడా తగ్గుతుంది.
ఇలాంటి ఫోర్ట్నైట్లీ సాలరీ సిస్టమ్ ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉంది. ఇప్పుడు నేపాల్ కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ విధానం విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా దీనిని అనుసరించే అవకాశం ఉంది.


