Abhishek Sharma : ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో 20 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు అత్యధిక సార్లు కొట్టిన భారతీయ బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ ఇప్పుడు టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. ఇప్పటివరకు ఎంఎస్ ధోనీ 10 సార్లు ఈ ఘనత సాధించగా, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌తో అభిషేక్ కూడా 10వ సారి ఈ మార్కును అందుకున్నాడు.