Bhu Bharathi Portal portal down: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ సర్వర్ సాంకేతిక కారణాలతో మొరాయిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద భారీగా క్యూలు ఏర్పడ్డాయి.