ఉదయం పూట అలారం మోగుతున్నా కళ్ళు తెరవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. రాత్రంతా నిద్రపోయినా, తెల్లవారుజామున వచ్చే నిద్ర మాత్రం మరెంతో మధురంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది కేవలం బద్ధకం వల్ల మాత్రమే జరుగుతుందని అనుకుంటే పొరపాటే. దీని వెనుక మన శరీరంలోని జీవ గడియారం, హార్మోన్ల పనితీరు మెదడు ప్రత్యేక నిద్ర దశలు దాగి ఉన్నాయి. అసలు ఉదయం నిద్ర ఎందుకు అంత గాఢంగా ఉంటుంది.