Gujarat Titans vs Royal Challengers Bengaluru Result: ఐపీఎల్‌ 2026లో భాగంగా 42వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు అందించిన 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్‌ 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది.