Hair and Nail Trimming: జుట్టు, గోళ్లు కత్తిరించేటప్పుడు నొప్పి ఎందుకు కలగదు?

మన శరీరంలో చిన్న గాయం అయినా విపరీతమైన నొప్పి కలుగుతుంది, కానీ జుట్టు లేదా గోళ్లను కత్తిరించినప్పుడు మాత్రం అసలు నొప్పి అనిపించదు. దీనికి కారణం మన జుట్టు గోళ్లు 'కెరాటిన్' అనే నిర్జీవ ప్రోటీన్ కణాలతో తయారవ్వడమే. ఈ కణాలలో రక్తనాళాలు లేదా నరాలు ఉండవు కాబట్టి మెదడుకు ఎలాంటి నొప్పి సంకేతాలు చేరవు. అయితే, మనకు కనిపించని వేర్లు చర్మం లోపల ఉండే భాగాలు మాత్రం నరాలతో అనుసంధానమై ఉంటాయి, అందుకే వాటిని పీకినప్పుడు లేదా చర్మానికి తగిలేలా కత్తిరించినప్పుడు మాత్రం నొప్పి కలుగుతుంది.
Related News
Comments
Login to leave a comment













