కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక కీలక పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాఖలైన ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఈ కేసుకు సంబంధించిన 'పేపర్ బుక్' (పిటిషన్ రికార్డులను) సీల్ చేసి భద్రపరచాలని స్పష్టం చేసింది.