స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో చైనా మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీనిని Y600 ప్రో పేరిట విడుదల చేసింది. ఈ వివో ఫోన్ నాలుగు రంగుల ఎంపికలలో లభిస్తుంది. ఈ పరికరంలో 6.83-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, బిగ్ 10,200 mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉండటం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

వివో వై600 ప్రో ధర, లభ్యత

వివో వై600 ప్రో స్మార్ట్‌ఫోన్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

1.8GB + 128GB స్టోరేజ్‌ వేరియంట్ ధర CNY 2,099 (సుమారుగా రూ. 29,000)

2.8GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,299 (సుమారుగా రూ. 32,000)

3.8GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,599 (సుమారుగా రూ. 36,000)

4.12GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,599 (సుమారుగా రూ. 36,000)

ఇక ఈ పరికరం 12GB + 512GB స్టోరేజ్‌తో కూడిన టాప్ వేరియంట్ ధర CNY 2,899 (దాదాపు రూ. 40,000). చైనాలో వివో Y600 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్స్ కు మే 5న నుండి ప్రారంభంకానున్నాయి. కాగా, ఈ ఫోన్ బ్రైట్ మూన్ బ్లాక్, ఫ్లోటింగ్ గోల్డ్, స్టార్ వైలెట్, వాస్ట్ బ్లూ రంగులలో లభిస్తుంది.

వివో Y600 ప్రో ఫీచర్లు

వివో Y600 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.83-అంగుళాల (1,260 x 2,800 పిక్సెల్స్) ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే HDR సపోర్ట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. వివో Y600 ప్రో 6nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300e చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో గ్రాఫిక్స్ సపోర్ట్ కోసం ARM మాలి-G610 GPU, 12GB వరకు LPDDR5 RAM, 512GB UFS 3.1 స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6 పై పనిచేస్తుంది.

ఫోటోగ్రఫీ పరంగా, వివో Y600 ప్రోలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్, ఇది 10x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. వివో Y600 ప్రో 10,200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోన్‌లో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, ఒక USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఇతర సెన్సార్లతో పాటు, ఐఆర్ బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ వివో ఫోన్ IP68 + IP69 రేటింగ్‌లతో వస్తుంది.