నవతెలంగాణ-మిడ్జిల్ మిడ్జిల్ తహశీల్దార్ గా రాఘవేందర్ రెడ్డి గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు మిడ్జిల్ తహశీల్దార్ గా పనిచేసిన పులి రాజు పదోన్నతపై బదిలీ కావడంతో ఆయన స్థానంలో రాఘవెందర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ భూ సమస్యల కోసం కృషి చేస్తానని చెప్పారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
The post మిడ్జిల్ తహశీల్దార్ గా రాఘవేందర్ రెడ్డి appeared first on Navatelangana.












