
హైదరాబాద్: ఆర్ టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన కుటుంబాని ప్రగాడ సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.... ఆర్ టిసి కార్మికులు ఎవరు తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. ఆర్ టిసి జెఎసి నాయకులతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబాన్ని దు:ఖంలో ముంచిందని బాధను వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆర్ టిసి కార్మికుల సమస్యలను ప్రభుత్వం గమనిస్తోందని, వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని వివరించారు.










