
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఆర్సిబిని గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని ఆర్సిబి భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సిబి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జిటి ముంబై ఇండియన్స్‌తో దారుణంగా ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్ విజయం ఆ జట్టుకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో జిటి జట్టులో రెండు మార్పులు చేసింది. జేసన్ హోల్డర్, మనవ్ సుతార్‌లను జట్టులోకి తీసుకుంది. ఇక ఆర్సిబి ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. గాయపడిన సాల్ట్ స్థానంలో బెతెల్ జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు:
ఆర్సిబి: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రోమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిక్ సలామ్ దర్.
జిటి: సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్.










