
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే.. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ, కొన్ని సంవ్సరాలుగా బాలీవు్డ్ అంటే క్రేజ్ తగ్గి అంతా సౌతిండియా ఇండస్ట్రీలపైపు చూస్తున్నారు. అందుకు కారణం దక్షిణ ఇండస్ట్రీ డైరెక్టర్లే.
తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో సౌతిండియా డైరెక్టర్‌తో పని చేయనున్నారు. ఆ హీరోనే సల్మాన్ ఖాన్. ఆ దర్శకుడే వంశీ పైడిపల్లి. సల్మాన్-వంశీ పైడిపల్లి సినిమాని ‘దిల్’ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో సల్మాన్‌కి జోడీగా నయనతార నటిస్తోంది. ఇక ఈ సినిమా 2027 రంజాన్ కానుకగా విడుదల చేస్తమని మేకర్స్ ప్రకటించారు, సల్మాన్ ప్రస్తుతం ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదలకానుంది.













