నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈక్రమంలో ఆయన మృతదేహాన్ని స్వగ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు.దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆర్టీసీ రెండో రోజు సమ్మెలో భాగంగా ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుటహుటినా ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు.
The post స్వగ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ అంత్యక్రియలు appeared first on Navatelangana.













