హైదరాబాద్: ఆర్టిసి సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల సాయం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తయ్యేలా జెఎసి నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. ఆపత్కాలంలో రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు సూచించారు.

మరోవైపు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టిసి జెఎసి నేతలతో మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.