ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఐపిఎల్ లో విజయవంతమైనవి. చెరో ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. కానీ ఐపిఎల్ లో ఈ రెండు జట్లూ తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. చెన్నై జట్టులో బౌలర్ల కొరత తీవ్రంగా వెంటాడుతోంది.