
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంతో కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆర్టిసి విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని మాటిచ్చి తప్పారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావని హరీష్ రావు ప్రశ్నించారు. ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ అమరుడైన రోజును అపాయింటెడ్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టిసి కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ మృతికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీష్ రావు సూచించారు.











