
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓ వైపు వరుస ఓటములతో సతమతమవుతున్న గుజరాత్ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌పై భారీ తేడాతో విజయం సాధించిన చెన్నై ఫుల్ ఫామ్‌లో గుజరాత్‌ను ఢీకొనేందు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్కో మార్పు చేశాయి. చెన్నై జట్టులోకి ఉర్విల్ రాగా, గుజరాత్‌లోకి అర్షద్ వచ్చాడు.
తుది జట్లు:
జిటి: సాయి సుదర్శన్, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), జాస్ బట్లర్(కీపర్), షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, మనవ్ సుతార్.
సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తిక్ శర్మ, జెమీ ఓవర్టన్, అకీల్ హుసెన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్‌జప్నీత్ సింగ్.











