
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రియాన్ డ్రెస్సింగ్ రూంలో ఈ-సిగరెట్ కాలుస్తూ.. కెమెరా కంటికి చిక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో 16వ జరుగుతున్న సమయంలో తోటి టీం మేట్స్ ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్ పక్కన ఉండగానే రియాన్ ఈ పని చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఐపిఎల్ నిబంధనల ప్రకారం.. స్టేడియంలో, డ్రెస్సింగ్ రూమ్‌ల్లో ధూమపానానికి అనుమతి లేదు. నిర్దిష్టమైన ప్రదేశాల్లో మాత్రమే పొగ తాగాలని నిబంధనలు చెబుతున్నాయి. అంతేకాక.. 2019 నుంచి భారత్‌లో ఈ-సిగరెట్లను నిషేధించారు. ఒకవేళ రియాగ్ ఈ-సిగరెట్ తాగాడని తేలితే.. ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) 2019 కింద అతడికి శిక్ష పడే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అంతకంటే ముందే ఈ ఘటనపై బిసిసిఐ విచారణ చేపట్టి పరాగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.











