
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఈనెల 8న చౌదరిగూడెం వద్ద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ నిర్వహించనున్నారు. పార్టీ స్థాపించిన తర్వాత జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగుతానని ప్రకటించిన కల్వకుంట్ల కవిత అన్నట్టుగానే ఈనెల 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కృష్ణా జలాల సాధనకు శంఖారావం పూరించనున్నారు. 8న ఉదయం జోగులాంబ అమ్మవారిని దర్శనం చేసుకోనున్న కవిత అదే రోజు సాయంత్రం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు సాధన పోస్టర్‌ను ఆవిష్కరించారు.












