ఒట్టావా: బైక్ ను కారు ఢీకొట్టింది. అనంతరం పది మీటర్లు ఎత్తులో గాల్లోకి ఎగిరి ట్రాఫిక్ సిగ్నల్ ఫోల్ కు బైక్ చిక్కుకుంది. ఈ సంఘటన కెనడాలోని సర్రే-డెల్టా రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిఎండబ్ల్యు కారు అతి వేగంతో బైక్ ఢీకొట్టింది. అనంతరం బైక్ గాల్లోకి ఎగిరి ట్రాఫిక్ సిగ్నల్ పోల్ కు చిక్కుకుంది.  ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదం నుంచి కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాల్లో బైక్ వేలాడుతుండడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.