నవతెలంగాణ – హైదరాబాద్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో గ్యాస్ నింపుతుండగా కారు ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో కారు పక్కన పార్క్ చేసిన మరో రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనం అగ్నికి ఆహుతయ్యాయి. పేలుడు శబ్దానికి స్థానికులు భయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

The post కారులో గ్యాస్‌ నింపుతుండగా భారీ పేలుడు… appeared first on Navatelangana.