అమరావతి: తిరువూరు మెప్మా ఎన్నికల్లో టిడిపి ఎంఎల్‌ఎ కొలికపూడి శ్రీనివాస్ వర్గం విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎంపి కేశినేని చిన్నికి ఎంఎల్‌ఎ కొలికపూడి దమ్కీ ఇచ్చారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య ఎంఎల్‌ఎ కొలికపూడి మద్దతు తెలిపిన జనసేన కార్యకర్త డెక్కా నవ్యకు 23 మంది సభ్యులు ఓటేయంతో గెలిచారు. ఎంపి చిన్నిపై కొటికపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్దంగానే విజయం సాధించామని, మెప్మా ఎన్నికలు సజావుగా సాగితే ఎంపి కేశినేని చిన్నికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించారు. మెజార్టీ సభ్యులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందని అడిగారు. చిన్ని అరాచకాలను తాను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని టిడిపి ఎంఎల్ఎ హెచ్చరించారు. తాను ఫలానా తప్పు చేశానని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చూపించగలరా అని సవాల్ విసిరారు. ఫ్లెక్సీకి కూడా డబ్బులు తానే ఇస్తానని తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు ఆశయాల సాధన కోసమే నిరంతరం పని చేస్తున్నానని తప్ప తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు. ఎంపి కేశినేని చిన్ని ఐదుగురు సభ్యులను కిడ్నాప్ చేయించడంతో పాటు మరో నలుగురు సభ్యులను ఇళ్లలో నిర్బంధించి రౌడీలను కాపాలా పెట్టారని కొలికపూడి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.