హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అద్దంకి- నార్కట్ పల్లి రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి పక్కనుంచి వస్తున్న బైక్ పైన ఉన్న వ్యక్తిను, ఎదురుగా ఇద్దరు వ్యక్తులను ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.