రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా సార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కానీ, ఎట్టకేలకు జూన్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

అయితే విదేశాల్లో ఒకరోజు ముందుగానే పెద్ది సందడి చేయనుంది. తాజాగా అక్కడ ప్రీసేల్‌ బుకింగ్స్‌ ఓపెన్ చేయగా టికెట్స్ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. 24 గంటలు కూడా కాకముందే లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. దీంతో నార్త్‌ అమెరికాలో అత్యంత వేగంగా ఇన్ని టికెట్స్ అమ్ముడైన తొలి సినిమాగా ‘పెద్ది’ రికార్డు నెలకొల్పింది.