యాక్షన్, ఎమోషనల్, రస్టిక్ డ్రామాలతో ప్రేక్షకులను మెప్పించిన హీరో కార్తీ ఇప్పుడు పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మ్యాడ్ సినిమాతో యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న కళ్యాణ్ శంకర్, ఇప్పుడు కార్తీ వంటి ఎనర్జిటిక్ హీరోతో కలిసి పని చేయడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆయన రైటింగ్ స్టైల్, ఫన్ డైలాగ్స్, యూత్‌ఫుల్ కామెడీ ట్రీట్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందట. ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. విడుదల తేదీతో పాటు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.