నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పొట్టిగుట్ట తండాలో మంగళవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళ మాట్లాడడం లేదని మనస్తాపానికి గురైన ప్రియుడు ఆమెను దారుణంగా హత్యచేశాడు. చందూర్ మండలం మేడిపల్లితండాకు చెందిన లకావత్ ఆనంద్.. పొట్టిగుట్ట తండాకు చెందిన పాతులోతు కవిత(36)ను పారతో తలపై కొట్టి హత్య చేశాడు. ప్రేమ వ్యవహారంలో జరిగిన ఈ ఘోరంపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. […]
The post ప్రియురాలిని పారతో కొట్టి చంపిన ప్రియుడు appeared first on Navatelangana.











