
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి శాసనసభా పక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో అమిత్షా సమక్షంలో జరిగిన శాసనసభాసక్ష సమావేశంలో పశ్చిమ బెంగాల్ సిఎంగా సువేందు పేరును అమిత్ షా ప్రకటించారు. శనివారం బెంగాల్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.















