
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. మే 18వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ని కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కోలివుడ్ భామ శృతి హాసన్ స్పెషల్ సాంగ్‌లో తుళుక్కుమననుంది. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన విడుదల కానుంది.
#PEDDI will stay in your hearts❤️
— PEDDI (@PeddiMovieOffl) May 11, 2026
TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd pic.twitter.com/8wIgUTgGrz













